SRD: పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఆరుద్ర నక్షత్ర వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శివలింగానికి ఉదయం 6 గంటల నుంచే అన్నాభిషేకం, ఫలాభిషేకం, రుద్రాభిషేకం మరియు భస్మాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.