JN: పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను CPM జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కమిటీ సభ్యులు ఏదునూరి మదర్ బుధవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకురావడం అన్యాయం అన్నారు. ఆ పథకాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.