KDP: ఒంటిమిట్టలో మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీ కోదండరాములవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హెలిప్యాడ్, పార్కింగ్, కల్యాణవేదిక ప్రాంతాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సాఫీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.