TG: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 27న ప్రకటించనున్నారు. కవిత తన పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఆ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.