ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సంస్థ ఛైర్మన్ జి. రాజగోపాల్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మంలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.