MBNR: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని ఐదు రూపాయల భోజన కేంద్రంలో నెలకొన్న సమస్యలపై మంగళవారం HIT TV యాప్‌లో ఓ కథనం ప్రచురితమైంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం కేంద్రానికి వెళ్లి, చిరిగిన టెంట్‌ను తొలగించారు. దీంతో అక్కడ భోజనం చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.