SDPT: మార్చి 28న తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. రాజీ పడదగిన కేసులను ప్రజలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీపడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారన్నారు.