TG: పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మరో 2, 3 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఘట్ కేసర్, ఎల్బీనగర్, అన్నోజీగూడ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.