SKLM: బూర్జ మండలం కొత్తవలస గ్రామం సమీపంలో వోని గెడ్డపై కల్వర్ట్ నిర్మాణానికి అనుమతులు లభించినట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.14 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. త్వరగా ఈ పనులను ప్రారంభించి గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.