NRPT: గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో వార్డు సభ్యుడు మంగలి అంజయ్య నల్ల కండువాతో ఇవాళ నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ సమావేశంలో అంబేడ్కర్ చిత్రపటంతో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ జ్యోతి నిధులను విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.