ATP: జనాభా లెక్కల సేకరణపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల సూచించారు. అనంతపురం శ్రీనివాస్ నగర్లో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇళ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల కోసమే ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ప్రజలు అధికారులకు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.