KDP: కమలాపురం నూతన తహసీల్దార్‌గా పామిలేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఉదయం తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెవెన్యూ పరంగా తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను కలవచ్చని తెలిపారు.