VKB: పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం దుద్యాల్ మండలం, సంట్రకుంట తండా పరిధిలోని నాణ్యనాయక్ తండాకు చెందిన రాథోడ్ తుల్చిబాయికి మంజూరైన చెక్కును ఆయన అందజేశారు.