TG: రాష్ట్రంలో రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల బంకులు మూతబడ్డాయి. పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలో 596 పెట్రోల్ బంకులు ఉండగా.. నిన్న 17,898 కిలోలీటర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అదనంగా 16 వేల కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం.