కోనసీమ: బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు లో మత్స్యశాఖ ద్వారా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మూడు లక్షలు విలువచేసే ఆటోలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందన్నారు.