KDP: పులివెందుల ప్రధాన రహదారిలోని MRF షోరూమ్ సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. ఓ విద్యుత్ మోటార్ మెకానిక్ షెడ్డులో తాళాలు పగలగొట్టి సుమారు 25 కేజీల కాపర్ దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. రైతులకు సంబంధించిన వైర్లు పోవడంతో మెకానిక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మెయిన్ రోడ్డుపైనే ఘటన జరగడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.