TG: ఏపీ మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. సుమారు 15 మంది గాయపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో పలువురు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.