TG: భద్రాచలం సీతారాముల కల్యాణానికి భక్తులు ప్రత్యేకంగా గోళ్లతో వడ్లను ఒలిచి, తయారుచేసే పవిత్రమైన బియ్యాన్ని ‘గోటి తలంబ్రాలు’ అంటారు. రామనామస్మరణతో మూడు నెలల పాటు నిష్టగా సిద్ధం చేసే ఈ బియ్యాన్ని రామయ్య కల్యాణంలో ఉపయోగించడానికి భక్తులు పాదయాత్రగా తీసుకెళ్లి సమర్పిస్తారు. ఏపీ, తెలంగాణలోని పలు భక్త బృందాలు ఏటా కోటి గోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించడం ఆనవాయితీ.