BDK: చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామపంచాయతీలో సమస్యలపై శనివారం సెక్రటరీకి స్థానిక నాయకులు వినతిపత్రం ఇచ్చారు. బ్లీచింగ్ చల్లడం, దోమల మందు పిచికారి, స్మశాన వాటిక, డంపింగ్ యార్డు, రైతు వేదికలు అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే త్రాగునీరు సమస్య పరిష్కరించాలని చెప్పారు. మండల నాయకులు శ్రీనివాసరావు, ఏడుకొండలు, ఆనందం, హేమంత్ కుమార్, కాంతారావు ఉన్నారు.