WGL: నెక్కొండ మండలం మడిపల్లి GP పరిధిలోని హరిచంద్ర తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ అనూష-వినోద్ లోక్ నాయక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వీరేందర్, వార్డ్ మెంబర్లు తదితరులు ఉన్నారు.