TPT: భాకరాపేట జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం వేడుకల్లో పశువులు ఒక్కసారిగా జనాలపైకి దూసుకురావడంతో రవిచంద్ర అనే వ్యక్తి మెడలోకి పశువు కొమ్ము దూసుకుపోయింది. మరో వ్యక్తి శ్రీనివాసులు తీవ్ర గాయాలైన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వేడుకలు మొదలవ్వకముందే జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.