TG: రాజస్థాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ(RVUNL)తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న సోలార్ ఒప్పందం ఎందుకని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ‘స్వయంప్రతిపత్తి కలిగిన సింగరేణికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు, కరెంట్ బకాయిలు కలిపి మొత్తం రూ.47 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో కార్మికుల సేఫ్టీ, జీతాలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒప్పందం ఎందుకు?’ అని నిలదీశారు.