KMM: రాష్ట్రంలోని ఆర్టీసీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని రవాణా కష్టాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో కొత్త బస్సులు, అదనపు సర్వీసులు పెంచాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వినతి పత్రం ఇచ్చారు.