ప్రపంచ వ్యాప్తంగా పలు టెక్ సంస్థల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. తాజాగా తమ సంస్థలో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులను మెటా తొలగించింది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. మరో వైపు ఆరుగురు ఎగ్జిక్యూటీవ్లకు 921 మిలియన్ డాలర్ల కాంపన్సేషన్ పెంచుతూ మెటా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రోజే లేఆఫ్‌ల గురించి కథనాలు రావటం గమనార్హం.