తమిళ నటుడు కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ ‘యూత్’. ఈ సినిమా విడుదల తేదీలో స్వల్ప మార్పు జరిగింది. నిజానికి మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, ఒక్కరోజు ఆలస్యంగా మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇందులో అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని కీలక పాత్రలు పోషించారు.