KMR: టీయూ ఇంజినీరింగ్ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ ఆచార్య యాదగిరిరావు బుధవారం విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరమే ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభమవ్వగా.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో 56 మందికి గాను 32 మంది ఉత్తీర్ణులై 57.14% ఉత్తీర్ణతను సాధించారు. కంప్యూటర్ సైన్స్, ఏఐ కోర్సులో 15 మంది విద్యార్థులకు గాను 9 మంది ఉత్తీర్ణులై 60%ఉత్తీర్ణత నమోదు చేశారు.