భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య ఈరోజు రాత్రి 9:30 గంటలకు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్.. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ రేసులో నిలుస్తుంది. దీంతో గెలుపే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు, ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది.