NRML: బైంసా పట్టణంలోని సౌన గ్రామస్తులు సబ్ కలెక్టర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రభుత్వం అందజేసిన ఖాళీ స్థలాలలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని కోరుతూ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో సర్వే చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు పేర్కొన్నారు.