PDPL: మంథని మండలంలోని ఖాన్ సాయిపేట్, వెంకటాపూర్, మల్లారం, స్వర్ణపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ ఛైర్మన్ కుడుదుల వెంకన్న బుధవారం ప్రారంభించారు. రైతులు సులభంగా ధాన్యం విక్రయించేందుకు ప్రభుత్వం గ్రామాల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తోందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో రైతు సంక్షేమానికి కృషి కొనసాగుతుందని తెలిపారు.