NGKL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని ఎంపీడీవో చెన్నమ్మ అన్నారు. నాగర్ కర్నూల్ మండలంలోని పులిజాల గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. ఇల్లు మంజూరు అయినప్పటికీ నేటికి పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.