SRPT: సూర్యాపేట జిల్లాలో నకిలీ పోలీసుల కాల్స్ కలకలం రేపుతున్నాయి. పెన్‌పహాడ్ స్టేషన్ సిబ్బందిమంటూ సైబర్ నేరగాళ్లు కొత్త పేర్లతో ఫోన్లు చేస్తూ, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపాలని బెదిరిస్తున్నారు. ఇలాంటి మోసాలను ప్రజలు నమ్మవద్దని, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మవద్దని కోరారు.