మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ఇవ్వాల్సిన పీఆర్సీలను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.