NZB: సిరికొండ మండలంలో 108ను ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనంలోని మందులు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో 108 జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్, సూపర్వైజర్ స్వరాజ్, ఈఎంటీ కిషన్, పైలెట్ రామ్ కుమార్ పాల్గొన్నారు.