MHBD: జిల్లా గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. తమకు గోనె సంచులు అందజేసి, మొక్కజొన్నలు సకాలంలో కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు డిమాండ్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి, ధర్నా విరమింపజేసేలా చేశారు. రైతుల ధర్నాకు రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.