TG: మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు అబద్ధమని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఆరోపించారు. చర్చలు జరుగుతుండగా కమిటీనే సమ్మె చేసుకోండి అంటూ వెళ్లిపోయిందన్నారు. ఎవరో రెచ్చగొడితే సమ్మె చేయడానికి తాము పిల్లలం కాదని చెప్పారు. ప్రతిపక్ష నేతలను తాము కలవలేదని, సమ్మెకు కారణం పొన్నం ప్రభాకరేనన్నారు. అన్ని పార్టీల మద్దతు కూడగడతామని వెల్లడించారు.