W.G. ఆచంట మండలం అయోధ్యలంక పరిధిలోని రావిలంకలో ఇవాళ వైసీపీ నాయకులు పర్యటించారు. గోదావరి నది నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని నిరసన వ్యక్తం చేశారు. రావిలంక పరిధిలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని వారు ఆరోపించారు.