KDP: బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందు కోసం ఆలయ పరిసరాలను కమీటి సభ్యులు ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటుచేశారు. ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు.