NRPT: బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతి గౌడ్ పిలుపునిచ్చారు. అప్పక్‌పల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండి నకిలీ ఉత్పత్తులను దూరంగా ఉంచాలని తెలిపారు.