AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురంలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. 40-60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.