KDP: కలసపాడు పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగార్జున ASI పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్సై సుభాన్ ఆధ్వర్యంలో బుధవారం ఆయనను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను గుర్తించి పదోన్నతి పొందడంతో పోలీస్ సిబ్బంది అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన సూచించారు.