కోనసీమ: అమలాపురం వై.జంక్షన్‌లోని భారత్ పెట్రోలియం బంక్ వద్ద గురువారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇంధనానికి ఎలాంటి కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం భయంతో పెద్ద ఎత్తున బంక్‌కు చేరుకుని పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో కొంతమంది బంక్ సిబ్బంది వాహనాలకు కాకుండా డబ్బాలలో పెట్రోల్ నింపుతున్నారని అక్కడ ఉన్న వారు చెబుతున్నారు.