MBNR: అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి మమేకమవ్వాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 99 రోజుల ప్రజల ప్రగతి ప్రణాళిక భాగంలో న్యూ టౌన్ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా వచ్చి మాట్లాడారు. జూన్ 2 వరకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని వివరించారు.