అనంతపురంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, హెడ్ కానిస్టేబుల్ హనుమాన్ను గాయపరిచిన షేక్ టోపీ వలీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాణినగర్కు చెందిన ఇతడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు సహకరించకుండా బూతులు తిడుతూ కానిస్టేబుల్ను కిందకు తోసేశాడు. దీంతో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.