ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్‌తో కలిసి నగరంలో బైక్‌పై పర్యటించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించి, మస్టర్ పాయింట్ వద్ద కార్మికుల హాజరును ఆరా తీశారు. అనవసరంగా బదిలీ వర్కర్లను నియమించవద్దని ఆదేశించారు. పాతూరు అన్న క్యాంటీన్లో అల్పాహారం తిన్న ఎమ్మెల్యే, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.