AP: కృష్ణా జిల్లా పామర్రు యువతి సుప్రియ అరెస్టును మాజీమంత్రి పేర్నినాని తీవ్రంగా ఖండించారు. సుప్రియపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి, ఆమెపై దాడి చేశారని ఆరోపించారు. ఆమెతో పాటు ఆమె సోదరుడిపై పెట్టిన కేసులకు సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో సీసీ ఫుటేజీని వెంటనే బహిర్గతం చేయాలన్నారు.