ADB: నేరాల నియంత్రణ, పరిశోధనలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఇచ్చోడ SHO రాజు పేర్కొన్నారు. శనివారం బోరిగాంలో ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఐదు సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.