NRPT: కృష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాంగణంలో జాతర సందర్భంగా మహాభారతంపై పోటీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు, యువతలో ధార్మిక విలువలు పెంపొందించడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. సమాజంలో ఎలా మెలగాలన్న అంశాలపై అవగాహన కల్పించడమే ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.