BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 30 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో కేవలం 4 మందికి మాత్రమే ఈ పదవులు దక్కే అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ ఆశావాహులు పదవులు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.