KMM: దానవాయిగూడెం జిల్లా సబ్ జైలులో బుధవారం రామన్నపేట బస్తీ దవాఖాన ఆధ్వర్యంలో ఖైదీలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు ఖైదీలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని DMHO డాక్టర్ రామారావు, జిల్లా వైద్య సేవలకు సమన్వయ అధికారి రాజశేఖర్ సందర్శించి ఖైదీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.