NLG: శౌలి గౌరారం మండలం అడ్లూరుకు చెందిన పచ్చిపాల రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. శనివారం జరిగిన ఆయన దశదినకర్మ సందర్భంగా రామకృష్ణ 2007 పదో తరగతి స్నేహితులు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి తామంతా అండగా ఉంటామని, భవిష్యత్తులోనూ ఇటువంటి సామాజిక బాధ్యతను కొనసాగిస్తామని మిత్రులు తెలిపారు.